తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. ఆహ్వానించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. అప్పటి పరిస్థితుల వల్ల పవన్ పై అలా వ్యాఖ్యలు చేశానని..నేను ఇప్పుడు ఎవర్నీ విమర్శించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో అసెంబ్లీకి వెళ్లాలని జగన్మోహన్ రెడ్డికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పని .. అసెంబ్లీలో ప్రతిపక్షానికే బాధ్యత ఉంటుందన్నారు