“తెలంగాణ ప్రజల దృష్టి కారణం” అని పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసి, వాటిపై తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి, పవన్ కల్యాణ్‌ను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. మంత్రి హోదాలో తాను చెప్పేది చాలా స్పష్టమని, క్షమాపణలు చెప్పకపోతే పవన్ నటించిన ఏ సినిమా కూడా తెలంగాణలో ఒక్క థియేటర్‌లోకి కూడా రానివ్వమని హెచ్చరించారు.

