నోయిడాలో కనీస వేతనాల అమలు కోసం కార్మికులు చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. పరిశ్రమల ముందు పెద్ద సంఖ్యలో గుమిగూడిన కార్మికులు రాళ్లు విసిరి అల్లర్లు సృష్టించారు. కార్మికుల ఆందోళనల్లో పాకిస్థాన్ పాత్ర ఉన్నట్లు యోగీ సర్కార్ అనుమానిస్తోంది. ఉత్తర్ప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అనిల్ రాజ్భర్ స్పందిస్తూ, ఇది సాధారణ నిరసన కాదని అభిప్రాయపడ్డారు పక్కా ప్రణాళికతో జరిగిన కుట్రగా కనిపిస్తోందని తెలిపారు.

