‘తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదు? అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా? అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు?’ అని పవన్ ప్రశ్నించారు.. వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతారని, అప్రమత్తంగా ఉండి వారి కుతంత్రాలను తిప్పికొట్టాలని సూచించారు. తల వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం కలగకూడదని, సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.

