పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్లి ప్రారంభించారు. గురువారం ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు తెల్లం వెంకట్రావ్ వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరుగనుంది. తెల్లం వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. ఆయనను తెల్లం వెంకట్రావు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరుగనుంది.

