ఓ హత్య కేసులో దోషి గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఖైదీగా ఉన్నాడు. హోం శాఖ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్‌ను తానే నడిపిస్తూ దందాలు చేయిస్తున్న సదరు మహిళే.. నెల్లూరు జిల్లాలో కొంతమంది రాజకీయ నాయకులతో పాటు సచివాలయంలోని కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని చెబుతున్నారు. మహిళ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారినా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారంటూ ఆరోపణలు వచ్చాయి.

