ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాను ఎగురవేయకపోవడంపై రాజకీయంగా వివాదం చెలరేగింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తూ,
జగన్ దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ తన ట్వీట్లో, ఇది కేవలం అహంకారం మాత్రమే కాదని, దేశ స్వాతంత్ర్య పోరాటానికి జరిగిన తీవ్ర అవమానమని పేర్కొన్నారు.

