ఐఐఎం అహ్మదాబాద్ దుబాయ్‌లో తన కొత్త క్యాంపస్‌కు శ్రీకారం చుట్టింది. గురువారం (సెప్టెంబర్ 11) దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, భారతీయ విద్య ప్రపంచీకరణలో ఇది ఒక పెద్ద ముందడుగు అని అన్నారు. ఇది భారతదేశంలోని అత్యుత్తమ ప్రతిభను ప్రపంచానికి తీసుకెళుతుందన్నారు.

