గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడతీసిన తీరు దారుణంగా ఉందని గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ ను ఎలా అశాస్త్రీయంగా విడతీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని కాంగ్రెస్ పార్టీపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, భవిష్యత్తును రాష్ట్ర విభజన సందర్బంగా అస్సలు పట్టించుకోలేదని తేజస్వీ సూర్య ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

