కేరళలోని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటక్ ఫ్రెంట్ (LDF), కాంగ్రెస్ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)కు గట్టి దెబ్బ తగిలింది. భారతీయ జనతా పార్టీ (BJP) సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (NDA) విజయకేతనం ఎగురవేసింది. 101 వార్డులకు జరిగిన ఎన్నికల్లో 50 వార్డులను బీజేపీ కైవసం చేసుకుంది. ఎల్డీఎఫ్ 29 వార్డుల్లో గెలుపు సాధించగా, 19 వార్డులను యూడీఎఫ్ సొంతం చేసుకుంది. రెండు వార్డుల్లో ఇండిపెండెంట్లు గెలిచారు.

