శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లాల్సిందేనని ఆర్టీసీ కార్మికులు పట్టుబట్టారు. పోలీసులు అంగీకరించకపోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఆర్టీసీ సంఘాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒత్తిడితో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేటకు తరలించారు. శంకర్ గౌడ్ నర్సంపేట డిపోలో 22 ఏళ్లపాటు సేవలందించారు. శంకర్ గౌడ్ ను కడసారి చూసుకుని నివాళులు అర్పించేందుకు ఆర్టీసీ కార్మికులు వేచి చూస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శంకర్ గౌడ్ ను కడసారి చూసేందుకు కార్మికులు భారీసంఖ్యలో తరలివస్తున్నారు.

