సన్ టీవీ నెట్వర్క్ షేర్లపై తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సన్ టీవీ నెట్వర్క్ షేర్లు ఈరోజు భారీగా పడిపోయాయి. స్టాక్ మార్కెట్ ఇంట్రాడే ట్రేడింగ్ సెషన్లో ఈ సంస్థ షేర్లు
దాదాపు 10 శాతం మేర పడిపోయాయి. దీంతో బీఎస్ఈలో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి రూ.547.55ను తాకింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి మనవడు, ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్ మేనల్లుడు అయిన కళానిధి మారన్ నియంత్రణలో ఉంది.

