సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతున్న వార్తలపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం అని.. ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి మోసపోవద్దని తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 13న ట్రాఫిక్ చలాన్లపై 100 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. ఈ రాయితీలకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి గానీ.. ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి గానీ అధికారిక ప్రకటన గానీ, సమాచారం గానీ రాలేదని పేర్కొన్నారు.

