రెండోసారి అమెరికా అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. జనవరి 20తో ఏడాది కాలం పూర్తి అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ తీసుకొచ్చిన విధానాలకు వ్యతిరేకిస్తూ అమెరికా వ్యాప్తంగా వివిధ సంఘాల కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. ప్లకార్లుడు, దిష్టిబొమ్మలతో తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ పాలన వల్ల అమెరికా అనేక సంవత్సరాలుగా నిర్మించుకున్న అంతర్జాతీయ విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు.

