ఓవైపు సోషల్ మీడియాలో పైరసీపై విచాారణ సాగుతుండగానే , కోయంబత్తూరు సమీపంలోని కరుమత్తంపట్టిలో కేబుల్ టీవీ నెట్వర్క్ నిర్వహిస్తోన్న పళనిసామి అనే వ్యక్తి తన లోకల్ ఛానల్లో ఈ నెల 11న రాత్రి ‘జన నాయగన్’ ప్రసారం చేశారు.
ఇంకా థియేటర్లలోకి రాని మూవీ టీవీల్లో వస్తుండడం చూసి అంతా షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న టీవీకే కార్యకర్తలు టెలికాస్ట్ నిలిపేయించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఛానెల్ యజమానిని అరెస్ట్ చేశారు.

