శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుటాగుళ్ల బెల్టు షాపు వద్ద గొడవ జరగగా గాయపడ్డ వ్యక్తిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు. కొందరు టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిపై దాడికి యత్నించారు. అడ్డుకున్న డాక్టర్, వైద్య సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. టీడీపీ నాయకుల దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కదిరిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. విధులను బహిష్కరించి టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

