పరకామణి చోరీ జగన్కు చిన్న అంశమైతే, తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీ (TTD)ని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నాడని దుయ్యబట్టారు.రూ.70 వేలు దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. పరకామణి చోరీలో ఒక రోజు సీసీ కెమెరాల్లో మాత్రమే ఆ దొంగ దొరికాడని మంత్రి ఆరోపించారు.

