కరీంనగర్ జిల్లా కేంద్రంలో పీఎంజే జ్యువెల్లరీ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డ నిందితుల ఫొటోలను కరీంనగర్ పోలీసులు విడుదల చేశారు.పీఎంజే షాప్‌లో ఉన్న సీసీ కెమెరాలో నమోదైన నిందితుల ఫొటోలను విడుదల చేశారు.
నిందితుల సమాచారాన్ని తెలియజేసినవారికి రూ.లక్ష బహుమతిని అందజేస్తామని ప్రకటించారు. నిందితుల జాడ తెలిసిన వారు ఎస్‌హెచ్‌వో 87126 70762 అనే నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. నిందితుల కాల్పుల్లో గాయపడ్డ సిబ్బంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

