దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2026 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో తొలి విడత జెఇఇ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) వెల్లడించింది.జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరుగుతాయి. ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్టిఎ తెలిపింది.

