జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టినట్టుగా ఆడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దగ్గుబాటి ప్రసాద్ బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు అక్కడి ఫ్లెక్సీలను చించివేశారు. పరిస్థితి చేజారకుండా పోలీసులు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను అడ్డుకున్నారు.

