నల్గొండ పట్టణంలోని పానగల్ ఫ్లైఓవర్ పై సోమవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా, తెల్లవారుజామున పానగల్ ఫ్లైఓవర్ పై వంతెనపై ఆగి ఉన్న లారీని సాయి సందీప్ ప్రయాణిస్తున్న కారు అతివేగంతో ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.

