ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అడిషనల్ డీజీ స్థాయి అధికారితో సిట్ విచారణ జరపాలని వ్యాఖ్యానించింది. ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలు భద్రంగా ఉన్నాయా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో నిర్ధారించాలని ఆదేశించింది. ఇప్పటికే ఎంపికై ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులు.. దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమున్నందున వారందరినీ అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది.

