ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు .. గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా అనర్హత వేటు భయం కనిపిస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రజాప్రతినిధి అయినా సభ అనుమతి లేకుండా వరుసగా 60 పనిదినాల పాటు సమావేశాలకు గైర్హాజరైతే, వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. కనీసం ఒక్క రోజు హాజరై సంతకం చేయడం ద్వారా ఆ సాంకేతిక ఇబ్బందిని అధిగమించాలని ఈ వ్యూహాన్ని రచించారు.

