కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తన ప్రేయసి అవీవా బేగ్‌తో రేహాన్ తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై గాంధీ, వాద్రా కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.అవివా బేగ్ కుటుంబం ఢిల్లీలోనే నివసిస్తుందనీ, రెండు కుటుంబాలూ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నాయని సమాచారం.

