‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా ‘లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీ‘ని రూపొందించామన్నారు. గచ్చిబౌలిలోని ‘ఐఐఐటీ హైదరాబాద్‘లో ‘నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం అండ్ తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ’ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు.

