యెమెన్లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది.వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో నిమిషాకు జులై 16 (బుధవారం) ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో చర్చల నేపథ్యంలో యెమెన్ చివరి క్షణంలో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్షను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. హత్యకు గురైన తలాల్ అబ్దుల్ మహదీ కుటుంబం.. గిరిజన నాయకులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితుడి కుటుంబానికి రూ. 11 కోట్ల బ్లడ్ మనీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు చెబుతున్నారు.

