పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్లో సుమారు 45 శాతం ఓట్లు బీజేపీకి పోలైనట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. 294 స్థానాలు ఉన్న బెంగాల్లో.. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం 194 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. తృణమూల్ కాంగ్రెస్ 94 స్థానాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం.. బీజేపీకి 45.07 శాతం ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఓట్ షేర్లో తృణమూల్‌కు 40.93 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది.

