తెలంగాణలో ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ ఫలితాలు పలు కుటుంబాల్లో తీరని ఆవేదన మిగిల్చాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా వేరేవేరు చోట్ల ఆరుగురు విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు. మెదక్, సూర్యాపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈ దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఫలితాలు చూసుకున్న పలువురు విద్యార్ధులు ఇంటర్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలుసుకుని తీవ్ర మనస్తాపం చెందారు. అనంతరం వరుస ఆత్మహత్యకు పాల్పడ్డారు.

