చైనాలో విక్టరీ డే పరేడ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజధాని బీజింగ్ వేదికగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సైనిక ప్రదర్శనను చైనాఏర్పాటు చేసింది. ఈ వేడుకలకు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్తో కలిసి వేదికను పంచుకున్నారు. ఒకే వేదికపై ఆసీనులయ్యారు. ఈ మూడు దేశాలు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.

