ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడును అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీల కలిశారు. ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్ పోర్టుకు వచ్చిన అయన అక్కడి నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు.
అక్కడ పలు అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో విశాఖలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణంలో అదానీ గ్రూపు పాలు పంచుకుంటోంది. ఈ అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ భేటీపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

