ఏఐ కారణంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు. ప్రాథమిక స్థాయి యువ ఉద్యోగుల అవసరం లేకుండానే సంస్థలు ఏఐ సాయంతో ఉత్పాదకతను పెంచుకుంటున్నాయని అన్నారు. కొత్తగా చదువులు పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు లభించడంలో ఇబ్బందులు ఎదురవుతుండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. ఏఐపై యువతలో నెలకొన్న భయాలు సబబేనని కూడా అభిప్రాయపడ్డారు. న్యాయసేవలు, ఫైనాన్స్, క్రియేటివ్ రంగాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు.

