బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు స్వంత ఇంటిపోరు తప్పడం లేదు. ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య “రెబెల్”గా ఎదురుతిరిగి తనతండ్రి, సోదరులు తేజస్వియాదవ్, తేజప్రతాప్ యాదవ్, సోదరి మీసా భారతి సూచనలను ఏమాత్రం సోషల్ మీడియాలో ఖాతరు చేయడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎన్డిఎతో ఢీకొని ముఖ్యమంత్రి పీఠంపై తన కుమారుడు తేజస్వీయాదవ్ను కూర్చుండబెట్టడానికి సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. మూడోది చాలా నాటకీయంగా ఇంటిపోరునే ఎదుర్కొంటున్నారు.

