ఉప రాష్ట్రపతి అభ్యర్థిపై ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశంలో ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను బీజీపీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు.. గతంలో కోయంబత్తురు ఎంపీగా పనిచేసిన రాధాకృష్ణన్.. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు. ఆయన గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు.

