ఇరాన్ కొత్త సుప్రీం నేతగా అయతుల్లా ఖమేనీ కుమారుడు మోజ్తాబా హుసేన్ ఖమేనీ ఎన్నికయ్యారు. ఇజ్రాయిలీ మీడియా ఈ విషయాన్ని పేర్కొన్నది. ఇరాన్‌కు చెందిన నిపుణుల అసెంబ్లీ మోజ్తాబాను ఎన్నుకున్నది. అయతుల్లా అలీ ఖమేనీ వారుసుడిగా మోజ్తాబా కొనసాగనున్నారు. మొజ్తాబా వయసు 56 ఏళ్లు. తన తండ్రి ఖమేనీ అడుగుజాడల్లో రాజకీయ, మతపరమైన వ్యవస్థలను ఆయన నడిచారు. మతపరమైన శిక్షణలో ఆయన చాన్నాళ్లుగా కొనసాగుతున్నా.. అయతుల్లా ర్యాంక్‌కు మాత్రం ఇంకా చేరుకోలేదు.

