మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్ కలిశారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ఆయనను కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం అనుమతించారు. దీంతో పాకిస్తాన్ లోని అడియాలా జైలులో ఇమ్రాన్ ను ఆయన సోదరి ఉజ్మా కలిశారు. జైలులో ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నట్లు తెలిపారు. కానీ ఆయనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు చేశారు.

