పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణాశర్మ ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్, కామెంటరీ విభాగం కింద దీనిని ప్రకటించారు. ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్బర్గ్క చెందిన నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి ఆనంద్, సుపర్ణ ఈ అవార్డును షేర్ చేసుకోనున్నారు.

