‘ప్రభుత్వం మీకు ఇచ్చే ఈ ఇందిరమ్మ చీరలు ఉచితం కావు. ఒక్కో చీర పేరుతో మీ పేరు మీద రూ. 1,200 అప్పు రాస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది.’అంటూ మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉచితమని చెప్పి చీరలు ఇస్తున్నారు, రేపు అదే మహిళలకు ఆ డబ్బులు కట్టమని నోటీసులు పంపిస్తారు. ఆధార్ కార్డు వివరాలు సేకరించడం, వేలిముద్రలు తీసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం ఇదేనని మాజీమంత్రి చెప్పుకొచ్చారు.

