“నాకైతే అప్పుడప్పుడూ.. కిందకు దిగి.. జర్నలిస్టుల చెంపలు చెడా మడా పగలగొట్టాలని అనిపిస్తుంది. కానీ పరిస్థితులు, హోదా అడ్డు వస్తూ ఉంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే, మర్యాద ఇచ్చి, పలుకరించి, ప్రెస్ మీట్ అయ్యాక, వాళ్లతో పది నిమిషాలు మాట్లాడి, నా ఉద్దేశం ఇది అని చెప్పేవాణ్ని” అని అన్నారు. ఐతే.. ఆయన యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు అన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆయన ఇలా మాట్లాడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

