బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటికి దాదాపు 25 మంది ఐపీఎస్ అధికారులు ఒకేసారి రావడం చర్చనీయాంశమైంది. పోలీసులు బస్సు, వ్యాన్లలో బాంద్రాలోని ఆయన ఇంటికి వచ్చారు. దీనికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా… ప్రస్తుతం బ్యాచ్‌లోని ఐపీఎస్ ట్రైనీలు ఆమిర్ ఖాన్‌తో సమావేశం కావాలని కోరగా… వారికి ఆయన తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారని ఆమిర్ ఖాన్ టీం సభ్యుడు వెల్లడించారు. ఆమిర్ ఇంతకు ముందు కూడా చాలా ఏళ్లుగా అనేక ఐపీఎస్ బ్యాచ్‌లను కలుస్తూ వచ్చారు.

