ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ విడిచి పెట్టనున్నాడని, తన కుటుంబంతో కలిసి ముంబైలో స్థిరపడనున్నారని గత కొన్ని గంటలుగా నెట్టింట బాగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్ ముంబైకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు నిజం కాదని అల్లు అర్జున్ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అతనికి ఇక్కడే సొంత ఇల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు.అలాంటప్పుడు అతను ముంబైకి ఎందుకు వెళ్తారు..? ప్రస్తుతం షూటింగ్ పనుల వల్ల ఎక్కువ సమయం ముంబైలో ఉంటున్నాడు.’ అని అరవింద్ చెప్పుకొచ్చారు.

