ఇరాన్ తో రెండో విడత చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం పాకిస్థాన్ కు వెళ్లనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు తొలుత ప్రకటించాయి. దీంతో పాక్ కు బయలుదేరేందుకు సిద్ధమవుతోన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చర్చల కోసం తమ బృందాన్ని పాక్ కు వెళ్లొద్దని ఆదేశించినట్లు వెల్లడించారు. అమెరికా మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఫలితం లేని చర్చల కోసం అంతదూరం వెళ్లవద్దని తమ బృందానికి చెప్పానని అన్నారు. ఇరాన్ ఎప్పుడైనా తమను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

