అమెరికా చట్టసభల భవనం క్యాపిటల్ ఎదురుగా ట్రంప్ బంగారు విగ్రహం ఏర్పాటుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి రేగుతోంది. కొందరు ఈ చర్యపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు ట్రంప్ చేతిలో క్రిప్టో కరెన్సీ ఉన్నట్టు 12 అడుగుల ఎత్తు ఉండేలా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. దీని కోసం క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు నిధులు సమకూర్చారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేటును 25 బేస్ పాయింట్ల మేర తగ్గించిన నేపథ్యంలో విగ్రహం ఏర్పాటు ఆసక్తికరంగా మారింది. దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు

