అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం చేసుకోవటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి అభినందించారు. సుంకాలను 18% శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. నిరంతరం ప్రపంచ వృద్ధిని కాంక్షించేలా ఈ దార్శనిక నిర్ణయం ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థికశక్తి కేంద్రంగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోందన్నారు సీఎం.

