ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు రూ.169 కోట్లతో లోక్ భవన్, జ్యుడిషియల్ అకాడమీ రూ.163 కోట్లతో అనుమతులకు ఆమోదం తెలిపారు. నాబార్డు నుంచి అమరావతి నిర్మాణానికి రూ.7,380.70 కోట్లు రుణం తీసుకునేందుకు అంగీకారం తెలిపారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధించే పనులకు రూ.532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు నిర్ణయించారు. 2024-25 వార్షిక నివేదికలు ఇచ్చేందుకు ఆమోదించారు.

