జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. పార్టీ విచారణ కమిటీ ముందు హాజరయ్యేందుకు కొన్ని గంటల ముందు బాధిత మహిళ మరో వీడియోను విడుదల చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయవద్దని, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని ఆ వీడియోలో బాధితురాలు కోరారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయనకు ఈ విషయంలో ప్రమేయం లేదన్నారు. అదే సమయంలో జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై మరోసారి ఆరోపణలు చేశారు.

