జర్మనీకి చెందిన ‘ది ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ’ అనే స్టార్టప్, అమెరికాకు చెందిన ‘సెలెస్టిస్’ అనే స్పేస్ బరియల్ సంస్థతో కలిసి ఈ వినూత్న ‘మిషన్ పాజిబుల్’ను చేపట్టింది. క్యాప్సూల్‌లో 166 మంది అస్థికలతో పాటు, ఔషధ ప్రయోగాల నిమిత్తం కొన్ని గంజాయి విత్తనాలు, ఇతర పరిశోధనా పరికరాలను కూడా ఉంచారు. సముద్రంలో సురక్షితంగా దిగడానికి కొన్ని నిమిషాల ముందు దానితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అనంతరం, అది పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోయినట్లు కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

