మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు శివమెత్తారు. వచ్చినవాళ్లు వచ్చినట్టు దంచేయగా డబ్ల్యూటీసీ టైటల్ పోరులో ఢిల్లీ రికార్డు స్కోర్‌తో చరిత్రకెక్కింది. ఓపెనర్లు శుభారంభమివ్వగా.. జెమీమా రోడ్రిగ్స్(57) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగింది. ఒత్తిడికి లోనైన ఆర్సీబీ బౌలర్లను ఆఖర్లో లారా వొల్వార్డ్త్(44), చిన్నెల్లీ హెన్రీ(32 నాటౌట్) బెంబేలెత్తించారు. డీక్లెర్క్ వేసిన 18వ ఓవర్లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన హెన్రీ 24 రన్స్ రాబట్టగా.. చివరి ఓవర్లో పది రన్స్ రావడంతో బెంగళూరుకు 204 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

