ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా అకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈవిషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు శుక్రవారం వెల్లడించింది. వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబరు 15 నుంచి నిర్వహించాల్సిన హెచ్1బీ వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదావేసింది. మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి’అని శుక్రవారం రోజు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

