హిందీ దివస్ సందర్భంగా జరిగిన అఖిల భారత అధికార భాషా సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ భాష ప్రాధాన్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని కేవలం సంభాషణలు, అధికారిక వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు శాఖ వంటి రంగాలలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. హిందీ ఇతర భారతీయ భాషలతో కలిసి నడవాల్సిన అవసరం ఉందని అమిత్ షా స్పష్టం చేశారు.”భాషల మధ్య ఐక్యతే దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.

