టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ ఈ వారం ‘సీడెన్స్ 2.0’ (SeaDence 2.0) అనే సరికొత్త ఏఐ వీడియో మోడల్‌ను విడుదల చేసింది. ఈ సాంకేతికత ప్రదర్శిస్తున్న ఫలితాలు చూసి సాంకేతిక నిపుణులు విస్తుపోతున్నారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ మోడల్ సామర్థ్యాన్ని కళ్లకు కడుతోంది. హాలీవుడ్ ప్రముఖ నటులు బ్రాడ్ పిట్, టామ్ క్రూయిజ్ మధ్య జరిగిన ఒక పోరాట సన్నివేశాన్ని ఈ మల్టీ-మోడల్ ఏఐ అద్భుతంగా సృష్టించింది.

